తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించాలి' - corona effect

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్మికుల సేవలు ప్రతీ ఒక్కరు గుర్తించాలని సూచించారు.

medical tests to sanitation employees
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించాలి'

By

Published : May 13, 2020, 8:03 PM IST

పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రతి ఒక్కరు గుర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పురపాలక కమిషనర్ వెంకటస్వామి కోరారు. పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందులు పంపిణీ చేశారు.

కార్మికుల సంక్షేమం కోసం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కరోనా వైరస్ నివారణకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వైద్యురాలు మౌనిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

ABOUT THE AUTHOR

...view details