తెలంగాణ

telangana

ETV Bharat / state

పేలుడు పదార్థాలు తరలిస్తున్న మావోయిస్టు కొరియర్​ అరెస్ట్​ - mavoist courier arrested in bhadradri kothagudem district

పేలుడు పదార్థాలను తరలిస్తున్న మావోయిస్టు కొరియర్​ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగుబల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పేలుడు పదార్థాలతో పాటు ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నారు.

mavoist courier arrested in bhadradri kothagudem district
పేలుడు పదార్థాలు తరలిస్తున్న మావోయిస్టు కొరియర్​ అరెస్ట్​

By

Published : Jun 12, 2020, 8:19 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామం వద్ద మావోయిస్టు కొరియర్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు రేగుబల్లి గ్రామంలో పోలీసులు, సీఆర్పీఎఫ్​ జవాన్లు వాహన తనిఖీలు చేస్తుండగా భద్రాచలం వైపు నుంచి దుమ్ముగూడెం వైపుకు అనుమానాస్పదంగా ఒక ట్రాక్టర్ వస్తుండగా పోలీసులు ఆపారు.

పోలీసులను చూసి పారిపోతుండగా ట్రాక్టర్​ను అదుపులోకి తీసుకున్నట్లు దుమ్ముగూడెం ఎస్సై రితీష్ తెలిపారు. ట్రాక్టర్​ను తనిఖీ చేయగా పేలుడు పదార్థాలను గుర్తించారు.

చత్తీస్​గఢ్​లోని చంద్రగూడెం గ్రామానికి చెందిన మీడియం జోగారావు చాలా సంవత్సరాల నుంచి మావోయిస్టు కొరియర్​గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు కూడా పేలుడు పదార్థాలు మావోయిస్టులకు అప్పగించేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 25 జిలెటిన్ స్టిక్స్, 100 మీటర్ల కార్ డెక్ వైరు, ఒక ట్రాక్టర్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొరియర్ జోగారావును అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇవీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న పేలుడుపదార్ధాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details