ఛత్తీస్గఢ్- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు రకరకాల కార్యకలాపాలు చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం వద్ద ప్రధాన రహదారిని మందుపాతరలతో పేల్చి ధ్వంసం చేశారు. పోలీస్ బలగాలు అటవీ ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఉలిక్కి పడ్డారు. భయాందోళనల నడుము బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఏజెన్సీలో అలజడి... మందుపాతరతో మావోల దుశ్చర్య - Maoists who destroyed the road with a Bomb
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే పనిలో పడ్డారు. ఇటీవలే అధికార పార్టీ ఎంపీటీసీని చంపేశారు. ఇప్పుడు మందుపాతరలతో విరుచుకు పడ్డారు.

Maoists who destroyed the road with a Bomb