Maoists: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తాజా వార్తలు
19:12 June 15
Maoists: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న 19 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు(Maoists) ఈరోజు చర్ల పోలీసుల ఎదుట లొంగి పోయారు. పులి గుండాల గ్రామానికి చెందిన పది మంది, బక్క చింతలపాడు గ్రామానికి చెందిన ఏడుగురు, ములకలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పోలీసులు ఎదుట లొంగిపోయారు.
పోలీసులు మారుమూల ప్రాంతాల్లోని లొంగిపోతున్న మావోయిస్టులకు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు భద్రతకు ఆకర్షితులై లొంగిపోయినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. లొంగిపోయిన 19 మంది మావోయిస్టుల్లో 17 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఇదీ చదవండి:'బలగాల ఉపసంహరణతో భారత్‌కే నష్టం!'