మావోయిస్టులు ఏడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాను(Engineer ajay roshan lakra) విడిచిపెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని(chhattisgarh state) బీజాపూర్ జిల్లాలో ఆయనను అపహరించిన మావోయిస్టులు ఇవాళ ప్రజాకోర్టులో మీడియా ముందు విడుదల చేశారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య అర్పితా లక్రా కూడా అక్కడే ఉన్నారు.
గత ఏడు రోజులుగా మీడియా, పెద్దలు ఇంజినీర్‌ను విడుదల చేయాలంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఇంజినీర్ ఆచూకీ కోసం భార్యతో సహా మీడియా సిబ్బంది 7 రోజుల పాటు అడవుల్లో గాలించారు.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(PMGSY) పథకం కింద బీజాపూర్‌లోని(bijapur district) మనకేలీ గోరనా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రా(36)(Engineer ajay roshan lakra) , అటెండర్ లక్ష్మణ్ పర్తగిరి(26)ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.