తెలంగాణ

telangana

ETV Bharat / state

Gadchiroli Encounter: గడ్చిరోలి ఎన్​కౌంటర్​పై మావోయిస్టుల హెచ్చరిక లేఖ.. ఏమన్నారంటే..? - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

గడ్చిరోలిలో జరిగిన భీకర ఎన్​కౌంటర్​​(Gadchiroli Encounter)పై మావోయిస్టులు స్పందించారు. ఈ ఏడాది చేపట్టిన వాటిలో అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని భావిస్తున్న ఈ ఎన్​కౌంటర్​(maoist encounter)పై మవోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేఖ(Maoist letter latest news) విడుదల చేశారు. లేఖలో మావోయిస్టులు ఏం ప్రస్తావించారంటే..?

Maoists released a letter responding on Gadchiroli Encounter
Maoists released a letter responding on Gadchiroli Encounter

By

Published : Nov 14, 2021, 3:24 PM IST

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శనివారం(నవంబర్​ 13న) జరిగిన ఎన్​కౌంటర్(Gadchiroli Encounter)​పై మావోయిస్టులు స్పందించారు. ఎన్​కౌంటర్​పై న్యాయవిచారణ జరిపించాలని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు లేఖ(Maoist letter) విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లా మావోయిస్టు డివిజన్​ కమిటీ పేరిట ఈ లేఖ(Maoist letter)ను విడుదల చేశారు. ఎన్‌కౌంటర్‌.. పచ్చి బూటకమని మావోయిస్టులు లేఖ(Maoist letter latest news)లో ఆరోపించారు.

మావోయిస్టులను అంతమొందించి.. అడవుల్లోని సహజవనరులను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బూటకపు ఎన్​కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్​కౌంటర్​(Gadchiroli Encounter)కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మావోయిస్టులు హెచ్చరించారు. ఈ పరిణామంతో సరిహద్దు రాష్ట్రాల మధ్య జరిగిన ఈ అలజడితో భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు(police high alert) అప్రమత్తమయ్యారు.

దద్దరిల్లిన అడవులు...

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఉండే ఓ గ్రామంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం పోలీసులకు అందింది. చుట్టుపక్కల గ్రామాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి.

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ..

ఈ ఎదురుకాల్పుల్లో.. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే కూడా ఉన్నట్లు సమాచారముందని గడ్చిరోలి ఎస్పీ అంకిత్​ గోయల్​ తెలిపారు. కోరేగావ్‌ భీమా-మావోయిస్టుల సంబంధాల కేసులో బలగాలు వెతుకుతున్న నిందితుల్లో తేల్‌తుంబ్డే ఒకరని తెలిపారు. నలుగురు జవాన్లకు కూడా ఈ కాల్పుల్లో గాయాలైనట్లు ఎస్పీ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు కొనసాగాయి. అనంతరం ఆ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

తెలంగాణ మావోయిస్టులను గుర్తించే పనిలో..

ఈ ఏడాది చేపట్టిన వాటిలో అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని భావిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌(Gadchiroli Encounter)లో మృతి చెందిన మావోయిస్టుల్లో తెలంగాణ(Telangana Maoists)కు చెందిన వారున్నారా? అనే కోణంలో రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. తెలంగాణ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిని దాటితే గడ్చిరోలి జిల్లాలోని సిరొంచ తాలూకా ప్రారంభమవుతుంది. తెలంగాణకు చెందిన పడకల్‌స్వామి(Telangana Maoist Padakal Swamy) ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు. శనివారం ఎన్‌కౌంటర్‌(Gadchiroli Encounter) జరిగిన అడవుల్లోనే ప్లటూన్‌ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారముంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన స్వామి దాదాపు రెండు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు.

సంబంధిత కథనాలు..

ABOUT THE AUTHOR

...view details