భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తూర్పుగోదావరి డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు వాడవాడలా నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు.
'అమరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి' - మావోయిస్టులు వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోలు ఓ లేఖను విడుదల చేశారు. తూర్పు గోదావరి డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో విడదల చేసిన ఈ లేఖలో... అమరుల సంస్మరణ వారోత్సవాల గురించి పేర్కొన్నారు.

Maoists released a letter in charla mandal
అమరుల ఆశయాల కోసం పోరాటం చేయాలన్నారు. అమరులకు విప్లవ జోహార్లు అందించాలని చెప్పుకొచ్చారు. శత్రువుల వ్యూహాత్మక దాడిని ఓడించాలని లేఖలో రాశారు. భారత విప్లవ ఉద్యమంపై ఎన్నడూ లేని స్థాయిలో దోపిడీ పాలకవర్గాల దాడి తీవ్రమైందని పేర్కొన్నారు.