తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో మావోల హల్​చల్​ - Bhadradri Kottagudem District latest news

మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకు అనేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద కందకాలను తవ్వినట్లు పోలీసులు గుర్తించారు.

Breaking News

By

Published : Jan 15, 2021, 5:51 AM IST

మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకు తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలో అనేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్​స్టేషన్ పరిధిలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పెద్ద పెద్ద కందకాలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర సరిహద్దు గ్రామం పూసుగుప్పకు ఒక కిలోమీటర్ దూరంలో 100 బూబీట్రాప్స్​తో పాటు 78 పెద్దపెద్ద గుంతలను భద్రతా బలగాలు గుర్తించారు. పోలీసులను హతమార్చడానికి అమర్చిన బూబీట్రాప్స్​ను బలగాలు తొలగించి, గుంతలను పూడ్చి వేశారు.

ఇదీ చదవండి: మృత్యుంజయుడు... బాలుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details