భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. ఈ నెల 9 నుంచి 16 వరకు సెలవుల్లో ఉన్న అతను 16 తర్వాత కూడా విధులకు వస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని డిపో అధికారి తెలిపారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా వ్యాధికి చికిత్స పొందుతూ మరణించాడు. దాదాపు 20 రోజులుగా సదరు డ్రైవరు విధులకు రాని కారణంగా ప్రైమరీ కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల డిపో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కరోనాతో ఆర్టీసీ ఉద్యోగి మృతి - మణుగూరులో ఆర్టీసీ ఉద్యోగి కరోనాతో మరణం
చాప కింద నీరులా వ్యాపిస్తోన్న కరోనా కాటుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందాడు. అతను గత 20 రోజులుగా విధులకు హాజరుకాలేదని.. డిపోలోని ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అన్ని రకాల వైరస్ కట్టడి చర్యలు తీసుకుంటామని డిపో అధికారి తెలిపారు.
కరోనాతో ఆర్టీసీ ఉద్యోగి మృతి
డిపో ఉద్యోగులెవరూ అధైర్య పడొద్దని, కరోనా వ్యాపించకుండా అవసరమైన అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నామని డిపో అధికారి తెలిపారు. తమకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రక్షణ పరికరాలు అందజేయాలని కార్మికులు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికుడు మృతి పట్ల కార్మిక సంఘాల నాయకులు సంతాపం తెలిపారు.