ప్రేమ పేరుతో వంచిస్తున్న వారున్నారు.. వేధిస్తున్న వారున్నారు.. తనకు దక్కని అమ్మాయి ఎవరికీ దక్కకూడదంటూ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్న వారున్నారు. ఇక్కడ అమ్మాయి దివ్యాంగురాలు. కాళ్లలో సమస్యతో నడవలేదు. నేలపై కూర్చుని చేతుల ఆధారంగా ముందుకు సాగుతుంటారు. ఈమెను ప్రేమించాడో యువకుడు. పెద్దలు వద్దన్నా ఆమెను వివాహం చేసుకున్నాడు (Ideal Love Marriage). నడవలేని ఆమెను వివాహ మండపానికి తన చేతులతో మోసుకెళ్లి పెళ్లిపీటలపై కూర్చోబెట్టి మనువాడాడు.
Ideal Love Marriage: ప్రేమకి అడ్డురాని వైకల్యం... దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు
సందడిగా పెళ్లి జరుగుతోంది. అందరూ బిజీగా ఉన్న సమయంలో ఓ ఇద్దరి చూపులు కలిశాయి. ఎలా అయినా అబ్బాయి ఆమెతో మాట్లాడాలి అనుకున్నాడు. దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆమె నుంచి కూడా అంతే స్పందన వచ్చింది. ఇంకేముంది ఇద్దరి మనసులు కలిశాయి. పెద్దలకు కూడా చెప్పారు. కానీ అమ్మాయినే కారణంగా చూపిస్తూ.. వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన మూతి వసంతరావు(22), మణుగూరుకు చెందిన దివ్యాంగురాలు నరసమ్మ (21)ల ప్రేమకథ ఇది. డ్రైవర్‌గా పనిచేసే వసంతరావు.. ఏడాది క్రితం ఓ వివాహ వేడుకలో నరసమ్మను చూశాడు. మాటలు కలిసి.. మనసులు అల్లుకున్నాయి. వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. తల్లిదండ్రులు, సోదరుణ్ని కోల్పోయిన నరసమ్మ తన వదిన వద్ద ఉంటూ డిగ్రీ వరకు చదువుకుని టైలర్‌గా ఉపాధి పొందుతోంది. పెళ్లికి ఇరువర్గాల వారి అభ్యంతరంతో ఈ ప్రేమజంట జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంఘం, దివ్యాంగ ఉద్యోగుల సంఘాన్ని ఆశ్రయించింది. స్పందించిన నాయకులు ఆదివారం కొత్తగూడెం రుద్రంపూర్‌లోని దేవాలయంలో వీరికి ఆదర్శ వివాహం జరిపించారు. వివాహ వేదిక వద్దకు వరుడు వధువును ఎత్తుకుని వస్తున్న సందర్భంలో ఆహ్వానితులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు.
ఇవీ చూడండి: