తెలంగాణ

telangana

ETV Bharat / state

పిడుగు పడి వ్యక్తి మృతి..స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు - today news man died of lighting strike

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యర గ్రామ పంచాయతీ పరిధిలో పిడుగు పాటుతో రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఇల్లందు మండల పరిధిలోని బిలియా తండాలో మిర్చి తోటలో పని చేస్తుండగా వర్షం రావడంతో సమీపంలోని వేప చెట్టు కిందికి వెళ్లారు. కొంతసేపటికే పెద్ద శబ్దాలతో పిడుగుపడి మిట్టపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ రాందాస్ అక్కడికక్కడే మృతిచెందాడు.

పిడుగు పడి వ్యక్తి మృతి.. స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు
పిడుగు పడి వ్యక్తి మృతి.. స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు

By

Published : Sep 10, 2020, 6:43 PM IST

Updated : Sep 10, 2020, 9:31 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యర గ్రామ పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు గురైన రైతు మృతి చెందాడు. ఇల్లందు మండల పరిధిలోని బిలియా తండాలో మిర్చి తోటలో పని చేస్తుండగా వర్షం రావడం వల్ల సమీపంలోని వేప చెట్టు కిందికి వెళ్లారు. కొంతసేపటికే పెద్ద శబ్దాలతో పిడుగుపడింది. ఘటనలో మిట్టపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ రాందాస్ అక్కడికక్కడే మృతిచెందాడు.

మిర్చితోట పనులకు వెళ్లగా...

బంధువుల ఇంటికి వచ్చి కొమరారం ఏరియాలో ఉన్న వ్యవసాయ భూమిలో మిర్చితోట పనులకు వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 13 మంది రైతులు చేనులో పనులు చేసుకుంటున్న క్రమంలో రాందాస్ అక్కడికక్కడే మృతి చెందగా... మిగతా 12 మంది స్పృహ కోల్పోయారు. గమనించిన గ్రామస్థులు బాధితులకు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత వారు కోలుకున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.

పిడుగు పడి వ్యక్తి మృతి.. స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు

మృతుడికి ఇద్దరు భార్యలు.. ముగ్గురు కుమార్తెలు.. ఇద్దరు కుమారులు

ప్రకృతి వైపరీత్యంతో మృత్యువాత పడిన మృతుడికి న్యాయం చేయాలని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కొమరారం ఎంపీటీసీ సభ్యులు అజ్మేర బిచ్చా, మాణిక్యారం సర్పంచ్ మోకాళ్ల క్రిష్ణా, బోయితండా సర్పంచ్ బాణోత్ సంతూ, కొమరారం సర్పంచ్ నాలీ క్రిష్ణవేణి, మిట్టపల్లి సర్పంచ్ గుగులోత్ అంబాలి, న్యూడెమోక్రసీ నాయకులు కోటేశ్, మాలు, రవి, భద్య, తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. మృతుడు రాందాస్​కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పిడుగు పడి వ్యక్తి మృతి.. స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు

పెద్దదిక్కును కోల్పోయి..

కేవలం కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే పెద్దదిక్కు మరణించినందున బాధిత కుటుంబీకులను ఆదుకోవాలన్నారు. 10 లక్షల రూపాయల పరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పిడుగు పడి వ్యక్తి మృతి..స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు

ఇవీ చూడండి : కంగనా రనౌత్​పై పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు

Last Updated : Sep 10, 2020, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details