భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి హుస్సేన్ నాయక్, భాజపా రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. బ్రిడ్జి సెంటర్ నుంచి చర్ల రోడ్డు వరకు... కూనవరం రోడ్డు నుంచి రామాలయం సెంటర్ వరకు యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భద్రాచలంలో గాంధీ సంకల్ప యాత్ర - భద్రాచలంలో గాంధీ సంకల్ప యాత్ర
భద్రాచలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. గాంధీ ఆశయాలు, ఆదర్శాలు నెరవేరాలని నియోజకవర్గమంతా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

భద్రాచలంలో గాంధీ సంకల్ప యాత్ర