భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నవంబర్ 13న కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదారమ్మకు మహా హారతి ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు. గత ఐదేళ్ల నుంచి ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు భద్రాచలంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున మహా హారతి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హారతులు ఇచ్చేందుకు ప్రత్యేక పూజారులు, పీఠాధిపతులు రానున్నట్లు చెప్పారు. సుమారు 5000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
కార్తీక పౌర్ణమి రోజు గోదారమ్మకు మహా హారతి - గోదారమ్మకు మహా హారతి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో కార్తీక పౌర్ణమి రోజున గోదారమ్మకు మహా హారతి ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.
![కార్తీక పౌర్ణమి రోజు గోదారమ్మకు మహా హారతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4810156-904-4810156-1571554494638.jpg)
కార్తీక పౌర్ణమి రోజు గోదారమ్మకు మహా హారతి
కార్తీక పౌర్ణమి రోజు గోదారమ్మకు మహా హారతి