కొలిచిన భక్తులకు కొంగు బంగారమైన గౌతమి తీరంలో గోదారమ్మకు మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భద్రాచలంలోని గోదావరి నది వద్ద జరిగిన ఈ వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఏటా కార్తీక పౌర్ణమికి గోదారమ్మకు మహా హారతులు అందిస్తారు. అనంతరం కమిటీ వారు ఉచితంగా అందించిన కార్తీక దీపాలను భక్తులు గోదావరి నదిలో విడిచిపెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
పులకించిన భద్రాద్రి... గౌతమితీరంలో భక్తజనసందోహం - karthika poojalu maha harathi at bhadrachalam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద మహా హారతి కార్యాక్రమం ఘనంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మహా హారతికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![పులకించిన భద్రాద్రి... గౌతమితీరంలో భక్తజనసందోహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5036847-thumbnail-3x2-vysh.jpg)
గౌతమి తీరంలో గోదారమ్మకు మహా హారతులు