విజయవాడకు చెందిన శ్రీ కైవల్య కృతి సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీతమ్మ తల్లికి "మా అమ్మకు మా సారె" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 29న భద్రాచలంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి మహిళా భక్తులంతా చీరలు, పసుపు కుంకుమ, గాజులు పట్టుకొని ఊరేగింపుగా బయలుదేరి రామయ్య సన్నిధికి చేరుకుంటారని తెలిపారు. అనంతరం ఆలయంలోని సీతమ్మ తల్లికి సారె సమర్పిస్తామని అన్నారు. గతంలో వీరు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల వల్ల దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని వెల్లడించారు.
భద్రాద్రిలో "మా అమ్మకు మా సారె".. - khammam
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ కైవల్య కృతి సేవాసమితి ఆధ్వర్యంలో ఈ నెల 29న సీతమ్మ తల్లికి "మా అమ్మకు మా సారె" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భద్రాద్రిలో "మా అమ్మకు మా సారె"..