చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
11:11 September 24
చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నపురం వద్ద జరిగిన ఎన్కౌంటర్పై పౌర హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు కాల్చి చంపారని పిటిషన్లో పేర్కొంది. పోలీసులపై హత్యా నేరం కింద ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని కోరింది. సిట్ ఏర్పాటు చేయాలని.. లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని పేర్కొంది.
మృతదేహాలను భద్రపరచి.. ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం జరిపించాలని పౌర హక్కుల సంఘం కోరింది. మృతుల వివరాలు తెలిసేందుకు.. ఫోటోలను పత్రికల్లో ప్రచురించి... కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించాలని కోరింది. అత్యవసర వ్యాజ్యంగా విచారణ జరపాలన్న సీఎల్సీ అభ్యర్థనను అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ చేపడతామని తెలిపింది.