తెలంగాణ

telangana

ETV Bharat / state

అయోధ్య రామునికి.. మిథిలానగరి జానకికి పెళ్లంటా!

సర్వ జగత్తును రక్షించే రఘుకుల రాముడు.. ఆ రఘురామున్ని కంటికి రెప్పలా చూసుకునే సీతమ్మకు భద్రాద్రిలో నిత్యం పెళ్లి కళే. ఏడాదికోసారి  శ్రీరామనవమి నాడు జరుపుకునే వీరి కల్యాణం సీతారాములు కన్నులపండువగా భక్తులకు సాక్షాత్కరిస్తారు. ఏప్రిల్​ 14 శుభముహూర్తమున జానకిరాముల వివాహా మహోత్సవానికి భద్రాద్రి ముస్తాబవుతోంది.

ప్రారంభమైన నవమి సందడి

By

Published : Mar 21, 2019, 8:02 PM IST

ప్రారంభమైన నవమి సందడి
కలియుగ పురుషుడు శ్రీరాముడు.. అయోనిజ సీతమ్మ ఒక్కటయ్యే ముహూర్తమే శ్రీరామనవమి. ఏప్రిల్​ 14న జరిగే సీతారాముల కల్యాణ వేడుకకు భద్రాద్రిలో ఏర్పాట్లను ఈరోజు ప్రారంభించారు. జానకి రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు మంగళ వాద్యాలు మార్మోగుతుండగా వేద మంత్రోచ్ఛరణ మధ్య పసుపు కొమ్ములు కొట్టే వేడుక చేశారు.

ఈరోజే జానకి రాముల కల్యాణం :

ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి కావడం వల్ల రామాయణ కాలంలో సీతారాముల కల్యాణం జరిగిన రోజని వేదపండితులు తెలిపారు. అయోధ్య రాముని వివాహానికి 150 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు చేస్తున్నారు. ఈరోజు 20 క్వింటాళ్ల బియ్యంలో పసుపు, కుంకుమ, నెయ్యి వంటి తొమ్మిది రకాల ద్రవ్యాలతో తలంబ్రాలు తయారు చేశారు.

గోటితో వొలిచిన తలంబ్రాలు :

జయ రాముని వివాహ వేడుక కోసం.. కొందరు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి గోటితో వొలిచిన బియ్యం తీసుకొచ్చి రాముని తలంబ్రాలలో కలిపారు.వచ్చే నెల 14న వైభవంగా జరిగే సీతారాముల కల్యాణానికి ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల మంది తరలివచ్చే ఈ వేడుక కోసం భద్రాద్రి ఇప్పటి నుంచే ముస్తాబవుతోంది.

ఇవీ చూడండి:ఈటీవీ భారత్... అర చేతిలో ప్రపంచం!

ABOUT THE AUTHOR

...view details