తెలంగాణ

telangana

ETV Bharat / state

Maha pattabhishekam: రామయ్య సన్నిధిలో నేడు మహా పట్టాభిషేక మహోత్సవం - ts news

Maha pattabhishekam: భద్రాచలంలో మహా పట్టాభిషేక మహోత్సవం నేడు జరగనుంది. ముఖ్య అతిథిగా గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ హాజరుకానున్నారు.

Maha pattabhishekam: రామయ్య సన్నిధిలో నేడు మహా పట్టాభిషేక మహోత్సవం
Maha pattabhishekam: రామయ్య సన్నిధిలో నేడు మహా పట్టాభిషేక మహోత్సవం

By

Published : Apr 11, 2022, 4:49 AM IST

Maha pattabhishekam: భద్రాద్రిలో నేడు మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కరోనా ఉపశమన అనంతరం ఈసారి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. చంద్రప్రభ వాహనంపై సీతారాములను ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరువీధి సేవలో ఊరేగుతున్న స్వామివారికి భక్తులు హారతులు అందించి నైవేద్యాలు సమర్పించారు.

కన్నులపండువగా కల్యాణం

రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రిలో జగాలను ఏలిన జగదేకవీరుడు శ్రీరామచంద్రుడికి, జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కల్యాణ వేడుక.. ఆద్యంతం కనుల పండువగా సాగింది. కొవిడ్‌ ప్రభావంతో రెండేళ్లు సాదాసీదాగా జరిగిన రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించి భక్తులు పునీతులయ్యారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఏడాదికి ఒకసారి జరిగే సీతారాముల వారి వార్షిక కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. జగదభిరాముడి కల్యాణ మహోత్సవం కనులారా వీక్షించి తరించేందుకు తరలివచ్చిన భక్త జన జయజయ ధ్వానాల మధ్య రాములోరి కల్యాణం జగత్ కల్యాణానికి అద్దం పట్టింది. వేద మంత్రోచ్ఛారణలు మారుమోగుతండగా.. అభిజిత్ లగ్న ముహూర్తాన జీలకర్ర మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచగా... కల్యాణ ఘట్టం ఆవిష్కృతమైంది. శుభముహూర్తంగా.. జగత్ కల్యాణంగా భావించే శుభసన్నివేశంగా..ముల్లోకాలు మురిసే విధంగా మూడు ముళ్ల బంధానికి నిదర్శనంగా మాంగళ్యధారణ జరిగింది.

ఇదీ చదవండి: Governor Tour: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్‌ రెండ్రోజుల పర్యటన

ABOUT THE AUTHOR

...view details