తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పకడ్బందీగా లాక్​డౌన్​ - Bhadradri kothagudem Corona Lockdown

కరోనా నివారణకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పకడ్బందీగా అమలవుతోంది. భద్రాద్రి ఇప్పటికే కరోనా రహిత జిల్లాగా మారగా... ఖమ్మంలో సైతం కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లాల సరిహద్దుల వద్ద చెక్​పోస్టులు ఏర్పాటు చేసి గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పకడ్బందీగా లాక్​డౌన్​
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పకడ్బందీగా లాక్​డౌన్​

By

Published : Apr 29, 2020, 9:39 PM IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లాక్​డౌన్​ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా పాజిటివ్ కేసులు లేని జిల్లాగా మారింది. ఖమ్మంలోనూ వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 751 మంది అనుమానితుల నమూనాలు సేకరించారు. 691 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది. 8 మందికి పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వీరిలో ఇద్దరు కోలుకున్నారు. మరో 61 మంది ఫలితాలు రావాల్సి ఉన్నాయి.

ఈ రెండు జిల్లాల సరిహద్దుల వద్ద భద్రతను పటిష్ఠం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు సరిహద్దులుగా ఉండడం వల్ల... చెక్​పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో పాజిటివ్ కేసులు నమోదైన పెద్దతండా, మోతీనగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ల జాబితా నుంచి తొలగించగా... ఖిల్లా, బీకే బజార్​లు కంటైన్మెంట్ ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి.

ఇవీచూడండి:ఆ విషయం గురించి కేటీఆర్​తో మాట్లాడా: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details