భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలో పోలీసులు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ పట్టణంలో ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో గ్రామస్థులు సైతం గ్రామ శివారులో కంచెలను ఏర్పాటు చేసి ఇతరులు ఎవరూ గ్రామంలోకి రాకుండా చర్యలు చేపట్టారు.
చెక్‌పోస్టుల వద్ద పోలీసుల పహారా - covid-19 latest news
లాక్డౌన్ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బయటి వారెవరూ మండలంలోకి రాకుండా పహారా కాస్తున్నారు.
చెక్‌పోస్టుల వద్ద పోలీసుల పహారా
గ్రామస్థులకు సర్పంచులు అవగాహన కల్పిస్తూ 31వ తేదీ వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరుతున్నారు. పోలీసు అధికారులు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ వేలుచందర్, తహసీల్దార్ మస్తాన్‌రావు అన్ని చెక్ పోస్టులలో ఎవరూ రాకుండా పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: లాక్డౌన్లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది