సందడి లేని గోదారి తీరం! - corona effect on godavari river bank in bhadrachalam
కరోనా వ్యాప్తికి విధించిన లాక్డౌన్ ప్రభావం భద్రాచలం గోదావరి నదీ తీరంపై పడింది. నిత్యం సందడిగా కనిపించే గోదావరి తీరం జనసంచారం లేక కళావిహీనంగా మారింది.
![సందడి లేని గోదారి తీరం! lock down effect on godavari river bank in bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7010754-333-7010754-1588303341333.jpg)
సందడి లేని గోదారి తీరం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి తీరం జనసంచారం లేక కళావిహీనంగా మారింది. ఇక్కడి చిరు వ్యాపారుల దుకాణాలు మూతపడ్డాయి. పితృ కార్యాలతో పాటు ఇతర పూజలు చేపించే వాళ్లు రాలేకపోతున్నారు. గోదావరి నీటిమట్టం 3.5 అడుగులకు పడిపోవడం వల్ల ఈ నదినే జీవనాధారం చేసుకున్న జాలర్లకు చేపల వేట సాగడం లేదు.