భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రధాన రహదారులతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతిరోజు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణాలను తెరిచి ఉంచేవారు.
రోడ్లన్నీ నిర్మానుష్యం.. మధ్యాహ్నం తర్వాత దుకాణాలు బంద్ - నిత్యావసర వస్తువులు
భద్రాచలంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలుచేయడానికి భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిత్యావసర వస్తువుల దుకాణాలన్నీ మూసివేయడం వల్ల రోడ్లన్నీ మూగబోయాయి.
రోడ్లన్నీ నిర్మానుష్యం.. మధ్యాహ్నం తర్వాత దుకాణాలు బంద్
కానీ ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరచి ఉంచాలని మధ్యాహ్నం 12 గంటల తర్వాత షాపులన్నీ మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనితో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చూడండి: సొంతంగా మాస్కు తయారు చేసుకోవటం ఎలా?