భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. వామపక్షాల ఆందోళన - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నూతన వ్యవసాయ బిల్లులు రైతులకు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ బిల్లులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. వామపక్షాల ఆందోళన
కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులు వ్యవసాయానికి, రైతాంగానికి నష్టం కలిగించేలా ఉన్నాయని.. సాగును మరింత సంక్షోభంలో పడేసేలా ఉన్న బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. లేని యెడల దేశవ్యాప్తంగా రైతులతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:సిటీ బస్సుల్లో మొదటి రోజు అంతంత మాత్రమే!