భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తూరుబాక గ్రామంలో లక్ష్మీదేవి జాతరలో ఆదివాసీలు భారీగా పాల్గొన్నారు. జోగ వంశీయుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీలు నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర శుక్రవారం ప్రారంభమైంది. నేటితో ముగియనుంది.
తూరుబాక గ్రామంలో ఘనంగా లక్ష్మీదేవి జాతర - లక్ష్మీదేవి జాతర తూరుబాక గ్రామం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తూరుబాక గ్రామంలో లక్ష్మీదేవి జాతరను ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. జోగ వంశీయుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఆదివాసీల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
తూరుబాక గ్రామంలో ఘనంగా లక్ష్మీదేవి జాతర
కార్యక్రమంలో పినపాక, ఇల్లందు నియోజకవర్గం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు.
ఇదీ చూడండి: అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం