భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధి అనుబంధ ఆలయమైన యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక కల్యాణం నిర్వహించారు.
నిరాడంబరంగా యోగానంద నరసింహ స్వామి కల్యాణం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
లాక్డౌన్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం నరసింహ స్వామి వార్షిక కల్యాణం నిర్వహించారు.

యోగానంద నరసింహ స్వామి కల్యాణం
లాక్డౌన్ కారణంగా భక్తులు ఎవరినీ అనుమతించకుండా ఆలయంలోపలే కల్యాణం జరిపారు. ముందుగా ఆలయ అర్చకులు విశ్వక్సేన ఆరాధన చేసి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రధారణ, మాంగల్య ధారణ వేడుక జరిపారు. అనంతరం తలంబ్రాల వేడుక, వేద ఆశీర్వచనం అందించారు.
ఇదీ చదవండి:KTR: సమ్మెకు ఇది సరైన సమయం కాదు