తెలంగాణ

telangana

ETV Bharat / state

Maoists surrender: భారీగా మావోయిస్టుల లొంగుబాటు... పోలీసులతో కలిసి భోజనం - ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు

ఇటీవల మావోయిస్టులు భారీ సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఆర్కే లాంటి కీలక నేతలు మరణం అనంతరం తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 43 మంది మావోయిస్టులు సుకుమా జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు.

large-number-of-maoists-surrendered-to-police-in-chhattisgarh-state-in-sukuma-district
large-number-of-maoists-surrendered-to-police-in-chhattisgarh-state-in-sukuma-district

By

Published : Oct 20, 2021, 10:24 PM IST

Updated : Oct 20, 2021, 10:41 PM IST

ఛత్తీస్​గఢ్​లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ సమక్షంలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ ఎదుట లొంగిపోయిన 43 మందిలో ఒకరిపై లక్ష రూపాయల రివార్డు ఉండగా.. మిగతా వారందరిపై పది వేల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారంతా కుకానర్ గాదిరాస్, ఫుల్బాగ్డి, చింతగుఫా పోలీస్ స్టేషన్ ప్రాంతాల పరిధికి చెందిన వాళ్లని పోలీసులు తెలిపారు.

Maoists surrender

వీరందరికీ జిల్లా ఎస్పీ సునీల్ శర్మ వారిపై ఉన్న రివార్డులను వారికే అందజేశారు. అనంతరం సీఆర్పీఎఫ్ అధికారులు, జిల్లా ఎస్పీ సునీల్ శర్మ మావోయిస్టులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అడవుల్లో ఉన్న మావోయిస్టులు అంతా జన జీవన స్రవంతిలో కలిసి వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా జీవనం గడపాలని ఎస్పీ కోరారు.

Maoists surrender
Last Updated : Oct 20, 2021, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details