తెలంగాణ

telangana

ETV Bharat / state

నిన్న బండారుగుంపు.. నేడు గాండ్లగూడ.. ఆగని పోడు భూముల పోరు.. - ధరణితో చిక్కులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజుకో చోట పోడు భూముల వివాదం రగులుతూనే ఉంది. ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న భూమిని అటవీ అధికారులు అన్యాయంగా స్వాధీనం చేసుకుంటున్నారని సాగుదారులు ఆరోపిస్తుంటే.. ప్రభుత్వ నిబంధనల మేరకే భూమిని తీసుకుంటున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో అక్కడ వివాదం రోజురోజుకూ చిలికి చిలికి గాలి వానలా మారుతోంది.

land
land

By

Published : Sep 25, 2022, 2:17 PM IST

గూడెంలో పోడు భూముల గోల.. అధికారులు, సాగుదారుల మధ్య ముదురుతున్న వివాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోడు వివాదం రగులుతూనే ఉంది. జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో ఈ వివాదం మరింత ముదురుతోంది. నిన్న బండారు గుంపులో అటవీశాఖ అధికారులు, పోడు భూమి సాగుదారుల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకోగా.. నేడు గాండ్లగూడలో అటవీశాఖ అధికారులు-సాగుదారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోడు భూములను దున్నుతున్న వారిని అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారులు గ్రామంలోకి రాకుండా సాగుదారులు రోడ్డుపై భైఠాయించారు. తమ సమస్య పరిష్కరించుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామంటూ మహిళలు ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న తమను భూములపైకి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

మరోవైపు నిబంధనల ప్రకారమే తాము భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూమి సాగుదారులకు హక్కులు కల్పిస్తామని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రకటన కార్యరూపం దాల్చే వరకు ఇటు పోలీసులు, అటు సాగుదారులు సమన్వయం పాటించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details