భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో కుడారై ఉత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళమ్మ వారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చిన ఆలయ అర్చకులు... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన కుడారై ప్రసాదాన్ని నివేదించారు.
భద్రాద్రి రామయ్య ఆలయంలో ఘనంగా కుడార్తె ఉత్సవం - telangana news
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కుడారై ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళమ్మ వారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చిన ఆలయ అర్చకులు... అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాద్రి రామయ్య ఆలయంలో ఘనంగా కుడార్తె ఉత్సవం
ఈ ఉత్సవంలో మహిళలు పాల్గొని సామూహిక కుంకుమార్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.
ఇదీ చదవండి:పంచుకుంటున్నారా.. తెంచుకుంటున్నారా!?