భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డీఆర్డీవో కార్యాలయంలో ఎరువుల విక్రయాల నిబంధనలపై రూపొందించిన గోడ పత్రికను జిల్లా అదనపు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆవిష్కరించారు. రైతులకు ఎరువులు విక్రయించే వ్యాపారులు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. ఎరువులు అమ్మే సమయంలో రైతులను ఎలాంటి ప్రలోభాలకు, మోసానికి గురి చేయవద్దని హెచ్చరించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి అమ్మకాలు, కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి అభిమన్యుడు, ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఏవోలు, విస్తరణాధికారులు పాల్గొన్నారు.
‘ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి’
రైతులకు ఎరువులు అమ్మే విక్రయ కేంద్రాల వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. ఎరువుల విక్రయాల నిబంధనలపై రూపొందించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.
‘ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి’