తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం ప్రకాశం మైదానంలో వ్యాయామం చేసే వారిని కలిసి ఓట్లను అభ్యర్థించారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని తమను గెలిపించాలని కోరారు. ఆదివాసీలతో ముచ్చటించి వారికి మొక్కలను పంపిణీ చేశారు.
'ఈ ఎన్నిక అహంభావానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే సమరం' - ఎన్నికల ప్రచారం
కొత్తగూడెంలో తెజస అధ్యక్షుడు కోదండరాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమ శక్తులన్నీ ఏకం కావాలని కోదండరాం కోరారు.
'ఈ ఎన్నిక అహంభావానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే సమరం'
వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నిక అహంభావానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే సమరమని ఆయన అన్నారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమ శక్తులన్నీ ఏకం కావాలని కోదండరాం కోరారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలకు అధికారుల బృందాన్ని పంపే యోచనలో కేంద్రం