తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ నగరంలో వరద.. మోకాలి లోతుకు చేరింది - మణుగూరులో ఇళ్లలోకి చేరిన మోకాలి లోతు వరద

మణుగూరులో కురిసిన వర్షాలకు పట్టణ పరిధిలోని కట్టువాగు, మెట్లవాగు, కోడిపుంజుల వాగులు పెద్దఎత్తున ప్రవహిస్తున్నాయి. ఈ తరుణంలో నగరంలోని పలుకాలనీలు నీటితో నిండాయి. ఇళ్లలోకి చేరిన నీటితో కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Knee-deep flooding reaching homes at manuguru
ఆ నగరంలో వరద.. మోకాలి లోతుకు చేరింది

By

Published : Aug 20, 2020, 1:46 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కురుస్తోన్న వర్షాలకు పట్టణ పరిధిలోని కట్టువాగు, మెట్లవాగు, కోడిపుంజుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు పోటెత్తి మణుగూరు పట్టణాన్ని ముంచేసింది.

సుందరయ్య నగర్, కాళీమాత ఏరియా, ఆదర్శనగర్, సమితి సింగారం, గాంధీనగర్, మెదర బస్తి కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి మోకాలి లోతు వరద చేరింది. వరద ముంపు కాలనీల్లో రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తోన్న వర్షం, వరదతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చూడండి :వర్షం ఎఫెక్ట్: భద్రాద్రి నుంచి బస్సు సర్వీసులు రద్దు

ABOUT THE AUTHOR

...view details