భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండంలోని కిన్నెరసాని వీఆర్వో పద్మను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ మహిళ కల్యాణ లక్ష్మి పథకాన్ని మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లింది. మంజూరు చేయాలంటే పదివేలు లంచం ఇవ్వాలని వీఆర్వో పద్మ డిమాండ్ చేసింది.
'కల్యాణ లక్ష్మి' మంజూరుకు లంచం... వీఆర్వో అరెస్టు - లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
పేద ప్రజలకు సాయం చేయాలని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి పథకాన్ని మంజూరు చేసేందుకు ఓ వీఆర్వో లంచం అడిగింది. తహసీల్దార్ కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ ఘటన పాల్వంచలో చోటుచేసుకుంది.
ఆఫీస్‌లోనే లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో
బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో పద్మ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇవీ చూడండి:అమెజాన్‌లోనూ ఇక మద్యం హోం డెలివరీ!