భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దమ్మపేట మండలం మల్కారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక దేశంలో ఎక్కడా లేదని... ఈ కార్యక్రమం వల్ల పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తోందని నామ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు కోరం కనకయ్య, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
'భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఖమ్మం ఎంపీ' - ఖమ్మం ఎంపీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటించారు.
'భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఖమ్మం ఎంపీ'