ఇల్లెందు పట్టణంలోని అన్ని గృహాలను సర్వే చేసి అర్హులందరికీ ఇంటి యాజమాన్య హక్కు కల్పించాలని ఎమ్మెల్యే హరిప్రియ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. ప్రగతిభవన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన శాసన సభ్యులు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
ఇల్లెందు పట్టణ సమస్యలను మంత్రి కేటీఆర్‌కు విన్నవించిన హరిప్రియ - భద్రాద్రి కొత్తగూడెం వార్తలు
దశాబ్దాలుగా పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా అన్ని గృహాలను సర్వే చేసి అర్హులందరికీ యాజమాన్య హక్కులు కల్పించాలని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ.. మంత్రి కేటీఆర్‌ను కోరారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
ఇల్లెందు పట్టణ సమస్యలపై మంత్రి కేటీఆర్‌కు విన్నవించిన ఎమ్మెల్యే హరిప్రియ
ఇల్లందు పట్టణంలో జీవో నెంబరు 76 కింద సర్వే బృందాలను వెంటనే ఏర్పాటు చేసి పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఈ జీవో ప్రకారం 2014 వరకు నివాసం ఏర్పరుచుకున్న వారికి మాత్రమే నిబంధన ఉందని... దీని వలన ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా నిబంధనలు మార్పుచేసి దరఖాస్తు గడువు పెంచాలని విన్నవించారు. కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.