కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. తొమ్మిది నెలల తర్వాత భద్రాద్రి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచి భక్తులు తరలివచ్చి... భద్రాచలంలోని లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకుంటున్నారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం క్యూలైన్లు అన్ని కిటకిటలాడుతున్నాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో కృత్తిక దీపోత్సవం వేడుక నిర్వహిస్తున్నారు.
రామయ్య సన్నిధిలో కార్తిక శోభ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో భక్తుల సందడి నెలకొంది. వేకువ జామునుంచే లక్ష్మణ సమేత సీతారాములను భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయంలో సోమవారం సాయంత్రం కృత్తిక దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు.
రామయ్య సన్నిధిలో కార్తిక శోభ
లక్ష్మణ సమేత సీతారాములకు ఉదయం అభిషేకం నిర్వహించారు. సాయంత్రం దీపాలంకరణ వేడుక నిర్వహించనున్నారు. కృత్తిక దీపోత్సవం వల్ల స్వామివారి నిత్య కల్యాణాన్ని ఒకరోజు నిలిపివేశారు. ప్రధాన ఆలయంలో శఠగోపం, తీర్థం ఇచ్చే ప్రక్రియను నిలిపి వేశారు. ఆలయం లోపలికి 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్ల లోపువారిని అనుమతించడం లేదు. కరోనా నిబంధనల పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి:బల్దియా పోలింగ్‌కు గట్టి బందోబస్త్ : సీపీ అంజనీకుమార్