కల్యాణలక్ష్మి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది: హరిప్రియ - ఎమ్మెల్యే హరిప్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండా, గంగారానికి చెందిన 125 మందికి ఎమ్మెల్యే హరిప్రియ కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పేదింట్లో జరిగే వివాహానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండా, గంగారానికి చెందిన 125 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య చెక్కులు పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లోని ఆడపడుచుల వివాహానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీపీ భూక్యా రాధ, సొసైటీ ఛైర్మన్ లక్కినేని సురేందర్ పాల్గొన్నారు.