భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు జ్యేష్ఠాభిషేకం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది జేష్ఠ మాసంలో రామయ్య తండ్రికి ఈ అభిషేకం చేస్తారు. ఇందులో భాగంగానే గురువారం గోదావరి నది వద్ద నుంచి తీర్థ బిందెను తీసుకువచ్చి యాగశాలలలో పూజలు నిర్వహించారు.
భద్రాద్రి రామయ్యకు ఘనంగా జ్యేష్ఠాభిషేకం - శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు జ్యేష్ఠాభిషేకం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల రామయ్య సన్నిధిలో ఘనంగా జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నదీజలాలు పంచోదకములు, పళ్ల రసాలతో అభిషేకం చేశారు.
భద్రాద్రి రామయ్యకు ఘనంగా జ్యేష్ఠాభిషేకం
శుక్రవారం ఉదయం నిత్య కల్యాణ మండపం వద్ద స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నదీజలాలు పంచోదకములు, పళ్లరసాలతోఅభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి దీప, ధూప నైవేద్యాలు సమర్పించారు.
ఇవీ చూడండి:మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం