తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణిలో కారుణ్య నియామకాలకు ఇంటర్వ్యూ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

సింగరేణిలో కారుణ్య నియామకాల కోసం అధికారులు ముఖాముఖి నిర్వహించారు. సింగరేణి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం నిర్వహించిన డైరెక్టర్లు నియామకాల కోసం ముఖాముఖి నిర్వహించారు. దాంతోపాటే.. బొగ్గు ఉత్పత్తిపై అన్ని ఏరియాల జీఎం, డైరెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

Job Interviews In Singareni  And Video Conference
సింగరేణిలో కారుణ్య నియామకాలకు ఇంటర్వ్యూ

By

Published : Jun 4, 2020, 10:34 PM IST

బొగ్గు ఉత్పత్తి పై సమీక్షా సమావేశం జరిపేందుకు సింగరేణి అధికారులు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో కరోనా వ్యాప్తి, బొగ్గు ఉత్పత్తి, కారుణ్య నియామకాల మీద అన్ని ఏరియాల జీఎంలతో డైరెక్టర్లు, కార్పొరేట్ జిఎంలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. నాణ్యమైన బొగ్గును రవాణా చేసేందుకు కావాల్సిన ఏర్పాట్ల మీద అధికారులు చర్చించారు. ఇల్లందు ఏరియా నుంచి రోజువారిగా 8వేల టన్నుల నాణ్యమైన G-13 గ్రేడు బొగ్గును రవాణా చేయడానికి, 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలని అధికారులు సూచించారు.

కారుణ్య నియామకాలకు ముఖాముఖి

ఇల్లందు ఏరియా జేకే ఉపరితల గని, 21 ఇంక్లైన్ గనుల కోసం కారుణ్య నియామకాల కొరకు మెడికల్ అన్​ఫిట్​ అయిన కార్మికుల వారసులకు జీఎం కార్యాలయం విభాగంలో ముఖాముఖి నిర్వహించారు. మొత్తం ఆరుగురికి వారి కుటుంబ సభ్యుల మరియు సాక్షుల సమక్షంలో ముఖాముఖి నిర్వహించి వివరాలు నమోదు చేసినట్టు.. డీజీఎం లక్ష్మీ నారాయణ తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వారిని వైద్యపరీక్షల కొరకు పంపి అనంతరం నియామక ఉత్తర్వులు అందిస్తామని అన్నారు.

ఇదీచూడండి :40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details