తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీటీసీపై హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు - It is the police who arrested the thugs who attempted to murder MPTC Ramu

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎంపీటీసీ రాముపై గత నెలలో హత్యాయత్నం చేసిన ఆరుగురు నిందితులపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అనంతరం ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.

It is the police who arrested the thugs who attempted to murder MPTC Ramu
ఎంపీటీసీపై హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Apr 19, 2020, 9:32 PM IST

గత నెలలో ఇంటి నుంచి బజార్​కి ద్విచక్రవాహంపై వెళ్తున్న ఎంపీటీసీ రామును దుండగులు కారుతో ఢీకొట్టారు. అనంతరం గొడ్డలి, కత్తి, కారంపొడిలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అతడు పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నాడు.

అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మురంగా చేపట్టారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించినట్లు ఇల్లందు సీఐ వేణుచందర్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details