తెలంగాణ

telangana

ETV Bharat / state

రామజన్మదినమా..? రామకల్యాణమా..? - BHADRADRI

శ్రీరాముడు.. రఘురాముడు.. జగదభిరాముడు.. సీతారాముడు.. అయోధ్యారాముడు, జానకీరాముడు, దశరథ రాముడు.. ఏ పేరుతో పలికితేనేం.. పిలిచిన వెంటనే భక్తుల కోరికలు తీర్చే దైవం. ఈ వరాల రామునికిష్టమైన శ్రీరామనవమి.. వచ్చేసింది. అసలు ఈ పర్వదినాన రాముడు జన్మించాడా.. సీతారాముల కల్యాణం జరిగిందా...? మధ్యాహ్నం 12 గంటలకే వివాహం ఎందుకు జరిపిస్తారు..?

రామజన్మదినమా..? రామకల్యాణమా..?

By

Published : Apr 14, 2019, 5:48 AM IST

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం లోక బాంధవుడిగా జన్మించిన జగదభిరాముని జన్మదినంను ప్రజలు పండుగగా జరుపుకుంటారు. ఇదే రోజు సీతారాముల కల్యాణం కూడా జరుగుతుంది.

రామజన్మదినమా..? రామకల్యాణమా..?

ఆ రోజే ఎందుకు...?

సీతారాముల కల్యాణం కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. రాముని జన్మదినం, కల్యాణం ఒకేరోజు ఈ వేడుకలు జరగడం వల్ల.. చైత్రశుద్ధ నవమి హిందువులకు అంత ప్రియంగా మారింది. కల్యాణ మహోత్సవం కూడా ఆయన జన్మ సమయమైన మధ్యాహ్నం 12 గంటలకే జరిపిస్తారు.

సీతారాముల కల్యాణం దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకను చూసేందుకు భక్తులంతా పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివెళ్తారు. మన రాష్ట్రంలోని భద్రాచలంలో ఈ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు.

14ఏళ్ల అరణ్యవాసము, రావణ సంహారం, శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో అడుగుపెడతాడు. మరుసటి రోజు చైత్ర శుద్ధ దశమి నాడు పట్టాభిషిక్తుడవుతాడు. అందుకే ఈ రెండు రోజులు భద్రాచలంలో సంబరాలు అంబరానంటుతాయి.

ఇవీ చూడండి: వేములవాడలో హిజ్రాల వైభోగం..

ABOUT THE AUTHOR

...view details