ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్... మహిళ మృతి - mahila
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. రావికంపాడు గ్రామంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది.
టిప్పర్ బీభత్సం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం రావికంపాడులో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఇంట్లో పడుకున్న వారిపైకి అకస్మాత్తుగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కూమార్తెకు గాయాలయ్యాయి. రెండు బైకులు, ఆటోలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని టిప్పర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.