భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. భద్రాచలంలో 1451 మంది, చర్లలో 293, దుమ్ముగూడెంలో 257 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రిలో ప్రశాంతంగా సాగిన ఇంటర్ మొదటి రోజు పరీక్ష - INTER EXAMS 2020
ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా.. మొదటి రోజు ప్రశాంతంగా సాగింది. భద్రాచలం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థులు... పరీక్షలకు హాజరయ్యారు.
INTER FIRST YEAR EXAMS FIRST DAY IN BHDRACHALAM
9 గంటల తర్వాత విద్యార్థులను అనుమతించమని నిబంధన పెట్టటం వల్ల 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరారు. విద్యార్థులను క్షుణ్నంగా పరిశీలించి పరీక్షకు అనుమతించారు.