తెలంగాణ

telangana

ETV Bharat / state

రామనారాయణ పేరుపై భద్రాద్రిలో మూడో రోజూ దీక్ష - rama name issue latest news

రాముడి పేరు మార్పుపై మూడో రోజూ దీక్ష కొనసాగుతోంది. రామనారాయణ పేరుతో పూజలు నిర్వహిస్తున్నారని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి దీక్ష చేపట్టింది.

రామనారాయణ పేరుపై భద్రాద్రిలో మూడో రోజూ దీక్ష
రామనారాయణ పేరుపై భద్రాద్రిలో మూడో రోజూ దీక్ష

By

Published : Feb 4, 2021, 1:21 PM IST

భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో రామచంద్రుడికి పూజలు జరగాల్సి ఉండగా.. రామనారాయణ పేరుతో పూజలు నిర్వహిస్తున్నారని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి... ఆలయం ఎదుట మూడవ రోజు దీక్ష చేపట్టింది.

రామదాసు ఆలయాన్ని నిర్మించిన నాటి నుంచి రామచంద్రుడు కొలువై ఉన్నాడని పూజలు జరుగుతున్నాయని అన్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆలయంలో పనిచేస్తున్న కొందరు రామచంద్రుడి పేరును మార్చి రామనారాయణుడిగా పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని దీంతో ఆలయం ఎదుట దీక్ష చేపట్టినట్లు భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు శంకర్​రెడ్డి పేర్కొన్నారు.

నెలరోజుల పాటు దీక్ష చేసిన అనంతరం హైదరాబాద్​ వరకు రథయాత్ర చేస్తామని వెల్లడించారు. అనాదికాలంగా వస్తున్న రామచంద్రుడి పేరుతో పూజలు నిర్వహించకపోతే.. పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details