భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూబెల్లి వద్ద అటవీశాఖ అధికారులు దాడులు జరిపారు. అక్రమంగా తరలిస్తున్న లక్ష రూపాయల విలువైన కలపను గుర్తించారు.
అక్రమంగా తరలిస్తున్న లక్ష రూపాయల కలప స్వాధీనం - పూబెల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న కలప
ఇల్లందు మండలం పూబెల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న లక్ష రూపాయల కలప స్వాధీనం
ధర్మాపురం నుంచి ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురంకు బొలెరో వాహనంలో రవాణా చేస్తున్న దుంగలను పట్టుకున్నట్టు అటవీశాఖ అధికారి మాతంగి రవి కిరణ్ తెలిపారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి అంతరించిపోతున్న అడవులను సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :పొలం చదును చేస్తుండగా... వెండినాణేలు లభ్యం