భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బుగ్గవాగు నాలాల ఆక్రమణ స్థలాన్ని పురపాలిక ఛైర్మన్ వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కొంతమంది సెప్టిక్ ట్యాంకులు నిర్మించకుండా వ్యర్థాలను నాలాలోకి పంపడంపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు నాలా ఆక్రమణల వల్ల ఇబ్బందులపై ఆరా తీశారు.
'ఆక్రమణలు తొలగించకుంటే... కబ్జాదారులపై కఠిన చర్యలు' - OTHERWISE STRICT ACTION SAYS ILLENDHU MUNICIPAL COMMISIONER
వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకుండా వ్యర్ధాలను నాలాలోకి వదిలే వారిపై ఇల్లందు పురపాలక సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆక్రమణలు వెనక్కి తీసుకోకుంటే నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని పాలకవర్గం స్పష్టం చేసింది.
'ఆక్రమణలు తొలగించకుంటే నోటీసులు'
ఆక్రమణదారులు రెండు రోజుల్లో స్వతంత్రంగా ఆయా ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. లేని పక్షంలో నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రాంతంలో ఉంటూ నాళాలను కలుషితం చేసే వారిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒక్క ఏడవ వార్డులోనే కాక పట్టణంలోని నాలుగో వార్డులో వ్యాపార సముదాయాలు సైతం నాలా మీద నిర్మితమై కబ్జాకు గురయ్యాయని, వీటిని కూడా అధికారులు ప్రజా ప్రతినిధులు గుర్తించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.