భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మొండితోగు పంచాయతీ పరిధిలోని అక్రమ నిర్మాణాన్ని అధికారులు తొలగించారు. 12 ఫీట్ల అంతర్గత రహదారిలో అక్రమ నిర్మాణం ఉందంటూ... రెండు వారాల క్రితం ఇద్దరు యువకులు జిల్లా కేంద్రంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.
అంతర్గత రహదారిపై ఉన్నఅక్రమ నిర్మాణాలు తొలగింపు - అక్రమ నిర్మాణాల తొలగింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మొండితోగులో అంతర్గత రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాన్ని అధికారులు తొలగించారు. రెండు వారాల క్రితం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తెలిపిన నిరసనకు స్పందించిన కలెక్టర్ చర్యలకు ఆదేశించారు.
అంతర్గత రహదారిపై ఉన్నఅక్రమ నిర్మాణాలు తొలగింపు
కలెక్టర్ స్పందించి... చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో తొలగించేందుకు వెళ్లిన అధికారులపై ఆక్రమణదారులు ప్రతిఘటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ రమేష్ సిబ్బందితో వెళ్లి... ఆక్రమణలు తొలగించారు.
ఇదీ చూడండి:ఆందోళనకరంగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం