తెలంగాణ

telangana

ETV Bharat / state

రాములోరి సన్నిధిలో అసాంఘికం... మిథిలలో మద్యపానం

ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి రాయిని దేవునిగా భావిస్తారు. చెట్టూ చేమను మొక్కుతూ... మము బ్రోవమని వేడుకుంటారు. అంతటి పవిత్ర క్షేత్రంలో మందుబాబుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. సుగుణాధిరాముడి సన్నిధిలో అసాంఘీక కార్యకలాపాలు మితిమీరిపోతున్నాయి.

భద్రాచలం సీతారామస్వామి ఆలయం

By

Published : Oct 24, 2019, 5:50 PM IST

భద్రాచలం సీతారామస్వామి ఆలయం

దక్షిణభారత అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయంలో ఏటా రెండుసార్లు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో మొదటిది సీతారాముల కల్యాణం, రెండోది ముక్కోటి ఏకాదశి. సీతారాముల కల్యాణం జరిగే మిథిలా ప్రాంగణంలో 50 వేల మందికిపైగా భక్తులు కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారు. అంతటి పవిత్రమైన మిథిలా ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది.

మందుబాబులకు కేరాఫ్​గా మిథిలా

సీతారాముల కల్యాణం జరిగే సమయంలోనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఆలయ అధికారులు, ఉద్యోగులు హడావుడి చేస్తారు. కల్యాణం తర్వాత ఆ ప్రాంగణాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఆ ప్రాంతం మందుబాబులకు కేరాఫ్​గా మారి... ఎక్కడ చూసినా ఖాళీ మందు సీసాలు, సిగరెట్ పెట్టెలే కనిపిస్తున్నాయి. మహా పవిత్రమైన సీతారాముల కల్యాణం జరిగే చోటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రామా... కనవేమిరా

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇదంతా చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. రామా... కనవేమిరా అంటూ రామచంద్రస్వామని వేడుకుంటున్నారు. ఎంతో పవిత్రంగా భావించే రామ సన్నిధిని పర్యవేక్షించి, పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ఆలయ అధికారులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details