తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారంలో ఉద్యోగులంతా పాల్గొనాలి : ఇల్లందు జీఎం

సింగరేణి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పలువులు సింగరేణి అధికారులతో జీఎం సత్యనారాయణ పలు కార్యక్రమాల నిర్వహణ గురించి సమావేశాలు నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇల్లందు జేకే ఉపరితల గని ప్రాంతంలో జులై 23న తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

Illandu Singareni Gm Meeting With Area officers
హరితహారంలో సింగరేణి ఉద్యోగులంతా పాల్గొనాలి :  ఇల్లందు జీఎం సత్యనారాయణ

By

Published : Jul 19, 2020, 10:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఉపరితల గని ప్రాంతంలో జులై 23న నిర్వహించ తలపెట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి సింగరేణి ఇల్లందు జీఎం సత్యనారాయణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇల్లందు గనిలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులు, కార్మికులు, కార్మిక కుటుంబాలు, పురప్రముఖులు పాల్గొనాలని అధికారులతో నిర్వహించిన సమావేశంలో జీఎం సత్యనారాయణ కోరారు. అనంతరం కార్మికులకు సంబంధించిన పలు అంశాల మీద చర్చించారు.

ఏక మొత్తంలో వచ్చే 25 లక్షల రూపాయలను కార్మికులు బ్యాంకులో పొదుపు చేసుకోవాలని ఆయన కార్మికులకు సూచించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు ఉద్యోగం కోల్పోతున్నందుకు అదనంగా ఇచ్చే 25 లక్షల రూపాయలను ఏక మొత్తంలో తీసుకొనే విషయంలో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్మికులకు వచ్చే డబ్బును దళారుల మాట విని మోసపోకుండా ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల్లో పొదుపు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇల్లందు సింగరేణి ఏరియా వర్క్​షాప్​లో రక్షణకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహించారు.

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎలక్ట్రికల్, మెకానికల్ సూపర్​వైజర్లు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. యంత్రాల వద్ద పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని వర్క్​షాప్​లలో పూర్తి నియమ నిబంధనలతో పని చేయాలని ఆదేశించారు. ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ సత్యనారాయణతో పాటు ఈ కార్యక్రమాలలో అధికారులు జానకిరామ్, నరసింహారావు, లక్ష్మీనారాయణ, పవన్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సైదులు, రవి కుమార్, వెంకట రామచంద్ర, సుధాకర్, సునిత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల

ABOUT THE AUTHOR

...view details