భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక అధికారులు, సిబ్బంది ప్రధాన రహదారిపై తిరుగుతూ.. రోడ్లపై చెత్త వేస్తున్న ఇంటి యజమానులకు పట్టణ పరిశుభ్రత కోసం సహకరించాలని, రోడ్లపై చెత్త వేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రథమ బాధ్యత పౌరులదే అని గుర్తు చేశారు.
పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న పురాతన నిర్మాణాలపై దృష్టి పెట్టి అందులో నివాసముండే వారిని ఖాళీ చేయించి.. వాటిని కూల్చి వేస్తున్నారు. ప్రమాదం జరగకముందే పురాతన భవనాలను కూల్చివేస్తున్నమని అధికారులు తెలిపారు.
ఇంటింటికీ తిరిగి దండం పెట్టారు.. చెత్త వేయొద్దని వేడుకున్నారు - ఇల్లందు పురపాలక సంఘం
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని.. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయొద్దని పట్టణంలో ఇల్లిల్లు తిరుగుతూ.. చేతులు జోడించి అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు స్పందిస్తూ.. రోడ్లపై చెత్త పారేయమని తెలిపారు.
ఇంటింటికీ తిరిగి దండం పెట్టారు.. చెత్త వేయొద్దని వేడుకున్నారు