తెలంగాణ

telangana

ETV Bharat / state

అంచనా బడ్జెట్​కు ఆమోదం తెలిపిన ఇల్లందు పాలకవర్గం - budget meetings

2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 63 కోట్ల 28 లక్షల 80 వేల అంచనాతో రూపొందించిన బడ్జెట్​కు భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు రూ.57 కోట్ల 83 లక్షలు ఖర్చు అయ్యే విధంగా ఈ బడ్జెట్​ను రూపొందించారు.

illandu  municipal Senate Approved budget
అంచనా బడ్జెట్​కు ఆమోదం తెలిపిన ఇల్లందు పాలకవర్గం

By

Published : May 15, 2020, 1:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్టుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఇంటి పనుల ద్వారా రూ. 2 కోట్ల 12 లక్షలు, అసైన్డ్ రెవెన్యూ ద్వారా రూ.36 లక్షలు, నాన్ టాక్సెస్ ద్వారా రూ. 2 కోట్ల 55 లక్షలు మొత్తం కలిపి రూ. 5 కోట్ల 3 లక్షల 80 వేల సాధారణ నిధులు సమకూరే విధంగా బడ్జెట్ రూపొందించారు.

ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా రూ.58 కోట్ల రూపాయలు వచ్చే విధంగా బడ్జెట్ తయారు చేశారు. మొత్తం కలిపి రూ.63 కోట్ల 28 లక్షల 80 వేలకు 2020-21 అంచనా ఆదాయం బడ్జెట్​కు ఆమోదం లభించింది. అంచనా ఖర్చుల కింద అవుట్సోర్సింగ్ వర్కర్ల జీతభత్యాలు రూ.కోటి 72 లక్షలు, పారిశుద్ధ్యానికి సంబంధించి రూ.42లక్షల 90 వేలు, కరెంటు ఛార్జీలు రూ.92 లక్షల 40 వేలు, హరిత బడ్జెట్ కింద రూ.67 లక్షల 75వేలు కేటాయించారు. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు రూ.57 కోట్ల 83 లక్షలు ఖర్చు అయ్యే విధంగా రూపొందించిన బడ్జెట్​కు ఇల్లందు పురపాలక సంఘం ఆమోదం తెలిపింది.

ఇవీ చూడండి:చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details